Dec 28,2022 09:55

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : ఇటీవల మరణించిన సినీనటులు కైకాల సత్యనారాయణ, తమ్మారెడ్డి చలపతిరావు కుటుంబ సభ్యులను టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఆయా ప్రాంతాల్లో ఉన్న వారి ఇళ్లకు మంగళవారం వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురి సినీనటుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రెండు రోజుల్లో ఇద్దరు ప్రముఖ నటులను కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కంభంపాటి రామ్మోహన్‌రావు, నాయకులు అట్లూరి సుబ్బారావు పాల్గొన్నారు.