
చుక్కల రేడును కలిసాము
చక్కని లోకము చూసాము
'దక్షిణ' చెక్కిలి ముద్దాడి
విజయాన్నే సాధించాము
ప్రతిభను మనము చూపాము
ప్రగతికి బాటలు వేసాము
వెన్నెల తరగల రాజును చేరి
మనమంతా పులకించాము
శోధనకు తెర తీసాము
కలలను నిజము చేసాము
ప్రపంచాన మన దేశాన్ని
అగ్ర పథాన నిలిపాము
పరాజయాలు పొందాము
పాఠాలు నేర్చుకున్నాము
విరామమెరుగక విక్రమిస్తే
విజయము మనదని చాటాము
ఖనిజాల నిల్వలను
అన్వేషించి తీసెదము
చందమామపై ఆవాసం
నిజం చేసి చూపిస్తాము
జాబిల్లిని ముద్దాడి
జగతిన మనము గెలిచాము
రాత్రి పగలు కష్టపడి
చరిత్రనే సృష్టించాము
- రావిపల్లి వాసుదేవరావు
94417 13136