చైతన్య మనోవికాస కేంద్ర సేవలు అభినందనీయం : చీరాల సీనియర్ సివిల్ కోర్టు జడ్జి సుధా మోహన్

ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : చీరాల సీనియర్ సివిల్ కోర్టు జడ్జి సుధా మోహన్ మంగళవారం చీరాల విఠల్ నగర్‌లో ఉన్న చైతన్య మనోవికాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి మానసిక వికలాంగులతో కొంతసేపు గడిపి బిస్కెట్లు, చాక్లెట్లను పంపిణీ చేశారు మానసిక వికలాంగులైన పిల్లలను సంరక్షిస్తూ వారిని చక్కగా చూడటం వారిని విద్యావంతులుగా తీర్చి దిద్దడంలో నిర్వాహకులు వెంకన్నను సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా ఏపని చేయడం కష్టంగా ఉన్న రోజుల్లో వీరిని ఇంత జాగ్రత్తగా చూడటం చాలా అభినందించదగిన విషయం అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు, న్యాయవాదులు ఎన్.కస్తూరి, బీ.అమృత్, జీ.కె.ఈశ్వరి రెడ్డి, ఆశ్రమ నిర్వాహకులు వెంకన్న, ఎస్డీ.మతీన్, తదితరులు పాల్గొన్నారు.