- అరంగేట్రం మ్యాచ్‌లోనే మూడు వికెట్లు
లండన్: ఇంగ్లండ్ వేదికగా జరిగే కౌంటీ క్రికెట్ మ్యాచ్‌లో భారత లెగ్‌స్పిన్నర్ యజ్ఞేంద్ర చాహల్ మెరిసాడు. డివిజన్-1 మ్యాచ్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌షైర్‌పై మూడు వికెట్లతో సత్తా చాటాడు. 33ఏళ్ల చాహల్ కౌంటిల్లో భాగంగా మొత్తం 20 ఓవర్లు వేసి ఇందులో ఆరు మెయిడెన్లు చేశాడు. ఇక 52పరుగులిచ్చి మూడు వికెట్లను కూల్చాడు. కెంట్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న చాహల్.. నాటింగ్‌హామ్‌షైర్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఇక కౌంటీల్లో ఆడుతున్న ఆర్ష్‌దీప్ సింగ్ మొత్తం 13 వికెట్లతో సత్తా చాటుతున్నాడు. ఈ ఏడాది జనవరి నుంచి భారతజట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న చాహల్.. ఆసియాకప్, ఐసిసి వన్డే ప్రపంచకప్ ప్రకటించిన జట్లలో చోటు దక్కించుకోలేకపోతున్నాడు.










