
బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటీనా మార్క్సిస్ట్ విప్లవకారుడు 'చే గువేరా' చెల్లెలు సెలియా గువేరా డి లా సెర్నా (93) బుధవారం అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో కన్నుమూశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెరికన్ ఆర్ట్ అండ్ ఈస్తటిక్ రీసెర్చ్ 'మారియో జె బుస్చియాజో', ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్టిటెక్చర్ ఆఫ్ యూనివర్సిటీ బ్యూనస్ ఎయిర్స్ సెలియా మరణాన్ని ధృవీకరించాయి. ఈ సందర్భంగా 'మా ఇనిస్టిట్యూట్‌కి ప్రిన్సిపల్, ఇన్వెస్టిగేటర్, అనేక రీసెర్చ్ ప్రాజెక్టుల డైరెక్టర్, ఆర్కిటెక్ట్, డెవలపింగ్ కంట్రీస్ స్పెషలిస్ట్ సెలియా గువేరా మరణాన్ని ప్రకటిస్తున్నందుకు మేము చింతిస్తున్నాము' అని ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ సోషల్‌మీడియా ద్వారా తెలియజేసింది. ముఖ్యంగా అనేక పరిశోధన ప్రాజెక్టులకు సెలియా డైరెక్టర్‌గా పనిచేశారని యూనివర్సిటీ గుర్తుచేసుకుంది. జిబిఎ (గ్రేటర్ బ్యూనస్ ఎయిర్స్) నార్త్ కారిడార్‌లో ఆమె అనేక శాస్త్రీయ సమావేశాల్లో పాల్గొన్నారని యూనివర్సిటీ పేర్కొంది.
కాగా, బొలివియా మాజీ అధ్యక్షుడు ఈవో మోరేల్స్ సెలియా గువేరా మృతికి తన సంతాపాన్ని తెలియజేశారు. సెలియా గువేరా కుటుంబానికి, లాటిన్ అమెరికన్ సోదరీ సోదరీమణులకు, ముఖ్యంగా అర్జెంటీనీయన్లకు, క్యూబన్లకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మోరెల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే లెఫ్ట్ అండ్ వర్కర్క్ ఫ్రంట్-యూనిటీకి అర్జెంటీనా డిప్యూటీగా ఉన్న వనినా బియాసి సెలియా మృతికి తన సంతాపాన్ని తెలిపారు. 'విద్యారంగానికి అంకితమైన మహిళ, ఎల్లప్పుడూ ఉద్యమకారులైపు నిలబడుతుంది' అని వనినా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సెలియా 1929వ సంవత్సరంలో జన్మించారు. చేగువేరా కన్నా ఏడాదిన్నర చిన్నది.
Celia Guevara (1929-2023)
Lamentamos comunicar el fallecimiento de la Arquitecta y Especialista en Países en Desarrollo Celia Guevara, quien fuera Investigadora Principal de nuestro Instituto y directora de varios proyectos de investigación. pic.twitter.com/5zT8N01kEs
— Arte Americano (@IAA_FADU) July 19, 2023