
పాలకొల్లు :భారత ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డులలో తెలుగు చిత్రం పుష్ప చిత్రంలో అద్భుత నటనకు అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించిన నేపథ్యంలో పాలకొల్లులో అభిమానులు తులా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. చిన్నకారుల స్టాండ్ సెంటర్ లోని అల్లు రామలింగయ్య కాంశ్య విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం బాణా సంచా కాల్చి, ప్రజలకు అభిమానులకు స్వీట్స్ పంపిణీ చేసారు. ఈ సందర్బంగా తులా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు సినీ చరిత్రలో 69 సంవత్సరాలుగా ఒక కలగా, లక్ష్యంగా ఉన్న జాతీయ ఉత్తమ నటుడు అవార్డును పాలకొల్లు ముద్దుబిడ్డ అల్లు అర్జున్ సాధించడం చాలా ఆనంద దాయకమని అన్నారు. ఆయనకు పాలకొల్లు అభిమానులుగా గర్విస్తూ అభినందనలు తెలుపుతున్నామ్మన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు వివిధ విభాగాల్లో అవార్డులు సాధించిన ఆర్‌ఆర్‌ఆర్, ఉప్పెన, కొండపొలం, పుష్ప చిత్రాలలో పలు విభాగాలలో అవార్డులు సాధించిన కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, చంద్రబోస్ తదితరులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు శిడగం సురేంద్ర, తులా సురేష్, ఆచంట దీపు, పువ్వల వెంకటేష్, కాపీశెట్టి పెదకాపు, మూర్తి, సాయి, గణేష్, ప్రముఖ నటులు అలుగు సత్తిబాబు, సాంబ, కూర్మా శ్రీను వలవల ఆనంద్, పడాల గణేష్, మూర్తి, వెంకటేష్, సాయి, కోట్ల నవీన్ అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.