Sep 07,2023 15:42

ప్రజాశక్తి -కర్నూలు కార్పొరేషన్‌:కర్నూల్‌ నగరంలోని కొత్త బస్టాండ్‌ దగ్గర గల కార్మిక కర్షక భవనం నందు రజక వృత్తిదారుల సంఘం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి. గురు శేఖర్‌, జిల్లా ట్రెజరర్‌ సిహెచ్‌ శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి సి. శేషాద్రి పాల్గని మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి. ఐలమ్మ ,విద్యుత్‌ పోరాటంలో అమరుడైన సత్తనపల్లి రామకృష్ణల వర్ధంతి సభలను ఈనెల 10వ తారీఖు జిల్లావ్యాప్తంగా మండల గ్రామాలలో జరపాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ నిర్ణయించింది.కావున వర్ధంతి సభ సందర్భంగా కర్నూల్‌ నగరంలో అపార్ట్మెంట్‌ వాచ్మెన్‌ రజక వఅత్తిదారుల లాండ్రీ షాపుల యజమానుల కర్నూల్‌ నగర విస్త్రుతస్థాయి సమావేశం 9-9-23 శనివారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు కొత్త బస్టాండ్‌ దగ్గర గల కార్మిక కర్షక భవనంలో ఉంటుంది. ఈ వర్ధంతి సభకు ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కరయ్య హాజరవుతున్నారు. కావున కర్నూల్‌ నగరంలో ఉండే అపార్ట్మెంట్‌ వాచ్మెన్‌ రజక వృత్తిదారులు , లాండ్రీ షాపుల యజమానులు మేధావులు రజక ఉద్యోగస్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.