Mar 01,2023 12:27

ప్రజాశక్తి- పిచ్చాటూరు (తిరుపతి) : జాతీయ పశు వ్యాధి నియంత్ర పథకం ద్వారా పిచ్చాట్టూరు మండలంలోని సిద్దిరాజు కండ్రిగ, పిచ్చాటూరు, రామగిరి గ్రామంలో పశు వైద్య శిబిరం ద్వారా డాక్టర్‌ ఇందిరా పరిరక్షణలో డాక్టర్‌ ధనంజయలు, డాక్టర్‌ మంజుల ఆధ్వర్యంలో మండలంలో మూడు బృందాలుగా ఏర్పడి బుధవారం 542 టీకాలు వేయడం జరిగినది. డాక్టర్‌ ధనుంజయలు, డాక్టర్‌ మంజుల మాట్లాడుతూ ... ఎండాకాలంలో దూడలకు, ఆవులకి తీవ్రమైన జ్వరం, నీరసం కొద్దిపాటి ఎండకు కూడా రొప్పడం చూడి పశువులు ఈసుకుపోవడం ఎద్దులలో పని సామర్యం తగ్గటం వ్యాధి వలన కలిగే నష్టాలు పాల ఉత్పత్తి మరియు పని సామర్యం గణనీయంగా తగ్గపోవడం-రైతుకు ఆర్థిక నష్టం పాలు తాగే దూడలలో మరణాలు వైద్యం నిర్లక్ష్యం చేస్తే పశువులు చనిపోవడం
        పశువుల్లో గాలికుంటు వ్యాధి టీకాల వలన కలిగే లాభాలు వ్యాధి సోకిన పాడి పశువుల్లో తగ్గే పాల ఉత్పత్తిని శాశ్వతంగా నివారించవచ్చు.వ్యాధి సోకిన మగ పశువుల్లో తగ్గే పని సామర్థ్యాన్ని పూర్తిగా నివారించవచ్చు. దూడల్లో మరణాలు తగ్గించి, ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. పశువుల గుర్తింపునకు చెవి పోగు వేయటం ద్వారా రైతులకు ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరుతుంది. పైన తెలియపరచిన రోజులలో తమ పశువైద్య సిబంది గ్రామాలలో సంచరిస్తూ రైతు ఇంటిముంగిటనే ఉచితంగా టీకాలను వేస్తారనీ, రైతన్నలు తమ సిబ్బందికి సహకరించి వారి పశువులకు గాలికుంటూ నివారణ టీకాలు వేసుకోవడం ద్వారా గాలికుంటూ వ్యాధి వలన కలిగే నష్టాలను నివారించుకోవచ్చునని పేర్కొన్నారు.