
జీడిపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీడిపప్పు ప్రయోజనాలైతే అమోఘం అనే చెప్పాలి. జీడిపప్పుల్లో మాంసకృత్తులు, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి6, కొవ్వు పదార్థాలు, ఖనిజాలు, లవణాలు, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. జీడిపప్పుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచేందుకు ఎంతో సహాయపడతాయి. రోజు తాము తినే ఆహారంలో కొన్ని జీడిపప్పులను తీసుకుంటే అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఉడికించిన మాంసంలో ఉండే స్థాయిలో జీడిపప్పుల్లో ప్రోటీన్లు ఉంటాయి. మాంగనీస్, మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల కండరాలు ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి. జీడిపప్పులను పచ్చివిగానే తిన్నా లేదా వేయించుకుని తిన్నా చాలా త్వరగా అరుగుతాయి. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లకు ఇవి ఎంతో మేలు చేస్తాయి.