Nov 20,2023 08:03

ప్రజాశక్తి-విజయవాడ: నగరంలోని జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి కార్ల రేసింగ్‌ జరిగింది. బెంజ్‌, ఫార్చ్యూనర్‌ కార్లతో యువతీ, యువకులు రేస్‌ నిర్వహించారు. ఈ క్రమంలో రామవరప్పాడు వైపు వెళ్తున్న 2 స్కూటీలను పోటీలో ఉన్న ఓ ఫార్చూనర్‌ కారు ఢకొీట్టింది. ప్రమాదంలో నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలైన వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారకులైన ఫార్చూనర్‌ కారులోని యువతి, యువకుడు మరో కారులో పరారయ్యారు. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన స్కూటీలు రెండు ముక్కలవ్వగా.. కారు ముందు భాగం ధ్వంసమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.