
అంకెలమండీ అంకెలం
చిక్కులు విప్పే అంకెలం
లెక్కలు చెప్పే అంకెలం
యుక్తిని గొలిపే అంకెలం
అంకెలలోని లింకులన్నీ
శంకలు లేక తెలిపెదమండీ
గణితంలోని ప్రక్రియలన్నీ
గమ్మత్తుగా చేసేదమండీ
గుర్తుతో బంధనమండీ
అంకెకు అంకె కలపడమండీ
కూడిక ఫలితం మొత్తమండీ
సంకలనమని అంటారండీ.
గుర్తు మధ్యన ఉంటే
తీసివేయుట చేయాలండీ
దీని ఫలితమే బేధమండీ
వ్యవకలనమని అంటారండీ
గుణ్యము,
గుణకము తో
లబ్ధమునే సాధించెదమండీ
గుణకారమని పిలిచెదరండీ
హెచ్చువేతని అంటారండీ..
భాగహారమే నా పేరండీ
భాగాలను చేయుదునండీ
కష్టం కష్టం అంటారండీ
ఇష్టం ఉంటే వశమగునండీ !
- మీసాల చిన గౌరినాయుడు
94928 48564