రెడ్డిగూడెం (కృష్ణా) : రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, విద్యుత్తు చార్జీలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ... సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, రెడ్డిగూడెం మండలం విస్సన్నపేట తహశీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం సిపిఎం ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కష్టాలు మర్చిపోయారని, వారికి కార్పొరేట్లు మాత్రమే గుర్తుంటారని విమర్శించారు. రోజురోజుకీ పేద ప్రజలపై భారాలు పడుతున్న ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం విస్సన్నపేట టౌన్ కార్యదర్శి మేకల జ్ఞాన రత్నం, సిఐటియు మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు వినుకొండ రంగారాణి, ఏడుకొండలు నక్క చిట్టిబాబు, ఎస్ కె బాజీ గద్దల బాబు, లాలయ్య సత్యనారాయణ, భవాని, గోవర్ధన్ పాల్గొన్నారు. అనంతరం విద్యుత్ బిల్లులను దగ్ధం చేసి విసన్నపేట మండల తహశీల్దార్ కి వినతిపత్రం సమర్పించారు.










