Aug 27,2023 17:53

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం :నిత్యాసరాలు ధరల పెరుగుదల విద్యుత్‌ చార్జీలు పెరుగుదల నిరుద్యోగ సమస్యలపై ఈనెల 30, 31 తేదీలలో పట్టణంలో ఇంటింటా సీపీఎం ప్రచారం జయప్రదం చేయాలని సీపీఎం పట్టణ కన్వీనర్‌ పసల సూర్యారావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య నిలయంలో పార్టీ సీనియర్‌ నాయకులు ఉప్పల గుప్త సత్యనారాయణ అధ్యక్షతన సి పి ఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కన్వీనర్‌ పసల సూర్యారావు మాట్లడుతూ సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు భాగంగా నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం పై ఇంటింట సీపీఎం ప్రచార కార్యక్రమం జరుగుతుందన్నారు. విద్యుత్‌ సంస్కరణలు పట్టణ సంస్కరణలు రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పినా వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం పట్టణ సంస్కరణలు అమలు చేసి ఇంటి పన్ను చెత్త పన్ను విపరీతంగా పెంచి వేసి ఈ సందర్భంలోనే విద్యుత్‌ ఛార్జీలు పేరుతో వాడుకున్న విద్యుత్‌ కన్నా రెట్టింపు వసూలు చేస్తున్నారనీ వాపోయారు.
విద్యుత్‌ చార్జీలు, ఇంటి పన్ను చెత్త పన్ను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏటా నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన బిజెపి ఎంతవరకు ఒక్కసారి కూడా ఉద్యోగ నియామకాలు జరపకుండా యువతను మోసగించిందన్నారు. అందువల్ల యువతీ యువకులు ప్రజలు రేపు సెప్టెంబర్‌ ఒకటవ తేదీన పట్టణంలోని సచివాలయాల వద్ద జరిగే ధర్నాలలో పాల్గొనాలని కోరారు. స్థానిక బైనర్‌ బ్రిడ్జి రోడ్ల మరమ్మత్తులు వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించక పోతే దశలో వారి ఆందోళనలు ఉదఅతం చేస్తామని హెచ్చరించారు .
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చల్లారి మాణిక్యాలరావు, వంగ గోపి ,షేక్‌ మబు సుభాని, ఆరేటి రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.