Sep 01,2023 14:47

పర్చూరు :సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సమరభేరి కార్యక్రమంలో భాగంగా అధిక ధరలు తగ్గించాలని, కరెంటు చార్జీలు తగ్గించాలని ఉద్యోగ కల్పన చేయాలని కోరుతూ సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు మజుంధర్‌ మాట్లాడుతూ డీఎస్సీ ప్రకటించాలన్నారు. రేషన్‌ షాపుల ద్వారా కందిపప్పు సరఫరాని కొనసాగించాలని, తదితర డిమాండ్స్‌ తో పర్చూరు ఇందిరా కాలనీ,నాగులపాలెం సచివాలయాల్లో సిపిఎం తరఫున ప్రజల నుంచి సంతకాల సేకరణ చేసి సచివాలయంలో వినతీపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సిహెచ్‌ మజందర్‌ పర్చూరు మండల నాయకులు ఎం డేవిడ్‌ ,బి చిన్నదాసు తదితరులు పాల్గొన్నారు.