Sep 04,2023 15:16

ప్రజాశక్తి-విఆర్‌పురం(అల్లూరిజిల్లా) : సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని, నిత్యవసర వస్తువులు ధరలు నియంత్రించాలని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విఆర్‌పురం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు సోమవారం ధర్నా నిర్వహించి తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ మాట్లాడుతూ.. రఖపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలను ముంపు జాబితాలో చేర్చాలని, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ 10 లక్షల 50 వేలు ఇవ్వాలని, పెంచిన గ్యాస్‌ పెట్రోల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం లక్ష్మి,. సర్పంచులు పూనెం సరోజిని. వెట్టి లక్ష్మి, ఎంపీటీసీ పూనం ప్రదీప్‌ కుమార్‌, మండల కమిటీ సభ్యులు పంకు సత్తిబాబు, కుంజా నాగిరెడ్డి, కదల కొండయ్య రెడ్డి,గూటాల శ్రీనివాస్‌, అసు లక్ష్మయ్య, పులి బోజ్జి, ఖాదర్‌, పాల్గొన్నారు.