
నూజివీడు : సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. ఏలూరు జిల్లాలో 10,303 మందికి 12,886.37 ఎకరాల భూమిని శాశ్వత హక్కుతో అందించనున్నారు. 31 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటికలకు 33.32 ఎకరాలను మంజూరు చేయనున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని (రిజర్వ్ ఫారెస్ట్ కాని భూమి) వారు సాగు చేసుకొని జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం డీకేటీ పట్టాల రూపంలో ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. గత నాలుగున్నరేళ్ల కాలంలో ఈ కార్యక్రమం ద్వారా 26,287 మంది గిరిజనులకు 39,272 ఎకరాల భూమిని పంపిణీ చేస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ... వైఎస్సార్ వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారనీ... చంద్రబాబు ఎవ్వరికీ పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. నూజివీడుకు చంద్రబాబు చేసిందేమీ లేదనీ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రెండు సీట్లు కూడా రావు అని చెప్పారు.