- ట్రెజరీ, వర్క్స్ అక్కౌంట్స్ శాఖల పాత్ర పెంచండి
- ప్రత్యేక ఆడిట్ విభాగం లేదు
- అదనపు చెల్లింపులు జరుగుతున్నాయి
- ముసాయిదా నివేదికలో కాగ్
- పద్దతి మార్చుకోవాలని సూచన
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : బిల్లుల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరి స్తున్న సిఎఫ్‌ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెరట్ సిస్టమ్), దానికి మూలమైన సిఎఫ్‌ఎస్‌ఎస్ (సెరటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ సర్వీసెస్) గందరగోళంగా మారిందనికంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) సూచించింది. నిర్ధుష్టమైన యంత్రాంగం లేకుండానే ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని దీని ప్రభావం ఖజానాపై తీవ్రంగా పడుతోందని పేర్కింది. ఈ మేరకు రూపొందించిన ప్రత్యేక ముసాయిదా నివేదిక ఆర్థికశాఖలో కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితమే ఉన్నతాధికారులకు చేరిన ఈ నివేదికపై ఆ శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 'సిఎఫ్‌ఎంఎస్‌ను అమలు చేయడానికి ప్రత్యేకమైన అంతర్గత వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. సాధారణ ఆడిట్ యంత్రాంగమే దీని బాధ్యతలు చూస్తోంది. సరైన నియంత్రణలు లేనందువల్లే ఈ ఏర్పాటు పాక్షికంగానే ప్రభావం చూపుతోంది. సిఎఫ్‌ఎంఎస్‌కు అనుగుణం గా కోడ్‌లను, నిబంధనలను సవరించలేదు. చివరకు వర్క్‌ఫ్లో విధానంలోనూ, సిస్టమ్స్‌లో కూడా అవసరమైన మార్పులు చేయలేదు.' అని ఈ నివేదికలో కాగ్ పేర్కొంది. తీవ్రమైన ఈ లోపాల కారణంగా చేసిన చెల్లింపులే మళ్ళీ,మళ్లీ చేయడం, ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేయడం వంటి సంఘటనలు తరచు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకుని సిస్టమ్ అడ్మిన్‌స్ట్రేటర్‌గా సిఎఫ్‌ఎస్‌ఎస్ పాత్రను సాధ్యమైనంత మేర కుదించాలని సూచించింది. ఆ విభాగం పాత్రను పరిమితం చేసి ట్రెజరీ అకౌరట్స్ కార్యాలయం, వర్క్స్ అక్కౌరట్స్ శాఖల ప్రమేయాన్ని పెంపొందించాలని పేర్కొంది. వీటితో పాటు ఆర్థిక వ్యవహారాలతో సంబంధ ముండే ఇతర విభాగాల పాత్రను కూడా సాధ్య మైనంత మేర పెంపొందించాలని సూచించింది. పెద్ద సంఖ్యలో ఏర్పాటైన పిడి ఖాతాల నిర్వహణ కోసం ప్రత్యేక వర్క్‌ఫ్లోను రూపొందించి అమలు చేయాలని పేర్కొంది. దీనివల్ల విశ్వసనీయత పెరుగుతుందని తెలిపింది. గందరగోళంగా ఉన్న అక్కౌంటింగ్ విధానాన్ని పిఎజితో సంప్రదించి ఒక కొలిక్కి తీసుకురావాలని, దానికి అవసరమైన నిబంధనలను, కోడ్‌లను రూపొందించాలని సూచించింది. కంటింజెన్స్ ఫండ్ నిర్వహణకోసం పిఎజి అనుసరిస్తున్న అక్కౌంటింగ్ విధానాన్ని అమలుచేయాలని సూచించింది. ముసాయిదా నివేదికలో అనేక అంశాలపై విస్తృతంగా చర్చించి నందున పూర్తిస్థాయిలో సమీక్ష చేసి, అవసరమైన నిర్ణయాలను తీసుకోవాలని ప్రభుత్వానికి కాగ్ సూచించింది. ఈ నివేదికలో 2018 నుంచి 2021 వరకు సాగిన లావాదేవీలను పిఏజి ప్రస్తావించింది.
బిల్లులపై నివేదికలో
ముసాయిదా నివేదికలో 2018 నుంచి 2021 వరకు పలు పద్దుల్లో జరిగిన వ్యయం, బిల్లుల అంశాలను ప్రస్తావించింది. ఈ మూడేళ్లలో 5,50,716 బిల్లులు ఒక సంవత్సరం నుంచి ఇంకో ఏడాది బదలాయింపు జరగ్గా, తాజా బిల్లులతో సహా 8,46,220 బిల్లులు ముగిసినట్లు నివేదికలో పేర్కొన్నారు. దీర్ఘ కాలంగా పెరడింగ్‌లో ఉన్న బిల్లుల వివరాలు కూడా ప్రస్తావిస్తూ వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించింది.
భారీగా బిల్లుల చెల్లింపులు
ఈ మూడేళ్ల కాలంలో చెల్లింపులు జరిగిన బిల్లుల వివరాలు కూడా నివేదికలో పొందుపరిచారు. ఇందులో 2018-19లో ఏకంగా 25 లక్షలకు పైగా బిల్లులు ఉన్నాయని, వీటి విలువ 1.28 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నట్లు చూపించారు. ఇందులో వర్క్స్ బిల్లులే అధికంగా ఉన్నాయి. 2019-20 23.23 లక్షల బిల్లులు, 2020-21లో 25.05 లక్షల బిల్లులు, 2021-22లో సెప్టెంబర్ వరకు 9.42 లక్షల బిల్లులు చెల్లించినట్లు పేర్కొన్నారు.










