
తమిళనాడు : తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం తిరువత్తూర్ జిల్లా దగ్గర వానియంబడి హైవే పై రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 60మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణీకులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.