Sep 08,2023 08:07
  • యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

న్యూయార్క్‌ : యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ పురుషుల డబుల్స్‌ ఫైనల్లోకి రోహన్‌ బొప్పన్న జోడీ ప్రవేశించింది. గురువారం జరిగిన తొలి సెమీస్‌లో 6వ సీడ్‌ బొప్పన్న, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌ జోడీ 7-6(7-3), 6-2తో అన్‌సీడెడ్‌ ఫ్రాన్స్‌కు చెందిన మహత్‌-హెబర్ట్‌ జోడీని చిత్తుచేసింది. దీంతో 2010 తర్వాత బొప్పన్న గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ కెరీర్‌లో రెండోసారి మాత్రమే ఫైనల్‌కు చేరాడు. రెండో సెమీస్‌ 3వ సీడ్‌ సాలిన్‌బరీ-ఆర్‌ రామ్‌, 2వ సీడ్‌ డోడిగ్‌-క్రాజిసెక్‌ల మ్యాచ్‌ విజేతతో ఫైనల్లో టైటిల్‌కై తలపడనున్నారు.