
ప్రజాశక్తి-పీలేరు (రాయచోటి-అన్నమయ్య) : బైక్‌ను బొలెరో పికప్ వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి పీలేరు-కడప జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. కెవి పల్లి మండలం, మిన్నంరెడ్డిగారిపల్లికి చెందిన గణేష్ (34) బైక్ పై వెళుతుండగా పీలేరు మండలం, ఠాణావడ్డిపల్లె వద్ద బలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న గణేష్ ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. పీలేరు ఎస్‌ఐ నరసింహుడు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.