ప్రజాశక్తి-వాకాడు (తిరుపతి) : వాకాడు మండల పరిధిలోని దుగ్గరాజుపట్నం పంచాయతీ పరిధిలో గల శ్రీనివాసపురం గ్రామ సముద్ర తీరంలో గుర్తుతెలియని మృతదేహం సముద్ర తీరానికి కొట్టుకొచ్చినట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ రఘు మాధవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాల్రెడ్డిపాలెం హాస్పిటల్కు తరలించినట్లు తెలియజేశారు.










