
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్ లో టీమిండియా, పాకిస్థాన్ జట్లు అక్టోబరు 14న తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నిలవనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఆరెంజ్ జెర్సీలతో బరిలో దిగనుందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీనిపై క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. టీమిండియా జెర్సీలపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. అవన్నీ ఒట్టి ఊహాగానాలేనని కొట్టిపారేసింది. కేవలం ఒక్క మ్యాచ్ కోసం మరో కిట్‌ను ధరించడం జరగదని వెల్లడించింది. ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రచారం చేయడం సరికాదని హితవు పలికింది. బ్లూ... భారత క్రీడా రంగానికి సంబంధించిన రంగు... వరల్డ్ కప్‌లోనూ ఈ రంగును మార్చడం జరగదు అని స్పష్టం చేసింది.