Mar 15,2023 13:24

ప్రజాశక్తి - అల్లూరి సీతారామరాజు జిల్లా : అరుదైన చర్మ వ్యాధితో ఓ బాలుడు నరకయాతన అనుభవిస్తున్నాడు. ఈ వ్యాధి వల్ల అతని చర్మం ఊడిపోతుంది... శరీరం రక్తసిక్తమవుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న బాలుడిని చూస్తే భయానికి గురవుతారు. ఆ బాలుని పేరు ప్రశస్థరత్నం. 'స్టీఫెన్‌ జాన్సన్‌ సిండ్రోమ్‌' అనే అరుదైన చర్మవ్యాధి బాలుడికి సోకిందని, అది కూడా పూర్తిగా ధృవీకరించలేదని వైద్యులు వెల్లడించారు. దీంతో ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ బాలునికి చికిత్స నందించాలని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవడంతో.. బోనకల్‌లోని మేఘశ్రీ, డా. పవన్‌ కుమార్‌ బాలునికి చికిత్సనందించేందుకు ముందుకు వచ్చారు. గత 15 రోజులుగా బాలునికి బోనకల్‌ మేఘ ఆసుపత్రిలో వారు వైద్యాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే బాలుని వ్యాధికి వైద్యం అందించడం కోసం ఆ కుటుంబం అప్పులపాలైంది. ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి బాలునికి వ్యై సాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సాయం అందించాలనుకున్నవారు వీరి కాంటాక్టు నెంబర్లు 9440326777 బాబు యు ప్రసస్థ రత్నం ఎ/సి 41745462362.