Oct 15,2023 14:21

వన్డే ప్రపంచకప్‌-2023లో శ్రీలంకకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ దసున్‌ షనక గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ దూరమయ్యాడు. అతడు తొడ కండరాల గాయంతో వన్డే ప్రపంచకప్‌ 2023 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డు అధికారికంగా దృవీకరించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్‌ 10న హైదరాబాద్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షనక కుడి తొడకు గాయమైంది.అతడు కోలుకోవడానికి దాదాపు 3 నుంచి 4 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని ఆల్‌రౌండర్‌ కరుణరత్నేతో శ్రీలంక క్రికెట్‌ భర్తీ చేసింది.