నైపుణ్యాభివృద్ధితో మెండుగా ఉపాధి అవకాశాలు : కలెక్టర్ సుమిత్ కుమార్
ప్రజాశక్తి-పాడేరు(అల్లూరిజిల్లా) : చదువుతోపాటు నైపుణ్యరంగాలలో శిక్షణ పొందితే ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక జి.ఎం ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన ఉద్యోగ విజయోత్సవం కార్య క్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగం ఎక్కడ వస్తే అక్కడకు వెళ్లి ఉద్యోగాలు చేయాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సమయం వృథా చేయకుండా సాధన చేయాలన్నారు. విజయం సాధించే వరకు సాధన చేయాలన్నారు. యువత అసాంఘిక కార్యక్రమాల వైపు వెళితే భవిష్యత్తు ఉండదన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానానికి మెరుగు పరుచుకోవాలని సూచించారు. పాడేరు శాసన సభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. యువతకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తలిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను చదివిస్తారని వారి ఆశయాలు సాధించపోయినా చెడ్డపేరు తీసుకు రాకూడదన్నారు. విద్యార్థి దశ నుండి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కృషి చేయాలన్నారు. విద్యార్థులు సమయాన్ని వదా చేయకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని చెప్పారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన యువతకు నియామక పత్రాలను పంపిణీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జి. ఎం. ఆర్, పాల్ టెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె. సుజాత, శిక్షణ మరియు ఉద్యోగ కల్పనాధికారి ఎం. రూపణి, ఎస్.డి ఓ జి. ప్రశాంత కుమార్, కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తది తరులు పాల్గొన్నారు.










