ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వెల్లడి
హైదరాబాద్ : సీనియర్ సిటిజన్లు, వికలాంగ వినియోగదారులకు ఉచితంగా ఇట్టి వద్దకే అందిస్తున్న బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపర్చుతున్నట్లు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుత డోర్‌స్టెప్ నగదు పికప్, డెలివరీని రూ.5,000 నుండి రూ.25,000కి పెంచినట్లు పేర్కొంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పని దినాల్లో ఎటువంటి ఖర్చు లేకుండా నెలకు నాలుగు సార్లు ఈ సేవలను పొందవచ్చని ఆ బ్యాంక్ ఎండి, సిఇఒ ఇట్టిరా డేవిస్ తెలిపారు.