Oct 19,2023 14:36

పూణే వేదికగా భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న బంగ్లాదేశ్‌ నిర్ణిత 50 ఓవర్లలో 256 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్లు తంజిద్‌ హసన్‌ 51, లిట్టన్‌ దాస్‌ 66 అద్భుతమైన ఆరంభం ఇవ్వగా దానిని మిగాతా బ్యాటర్లు ముందుకు తీసుకువెళ్లలేదు. నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో 8, మెహిదీ హసన్‌ మిరాజ్‌ 3, హృదయ్ 16, నసుమ్‌ అహ్మద్‌ 14 తీవ్రంగా నిరశపరిచారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌ వచ్చిన ముష్ఫికర్‌ రహీమ్‌ 38 పరుగులు, మహ్మదుల్లా 46 పరుగులు చేయడంతో బంగ్లా 256 పరుగుల స్కోరు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్‌ 2, జడేజా 2, కుల్‌దీప్‌ 1, శార్దుల్‌కు 1 వికెట్‌ దక్కింది.

  • హృదయ్ ఔట్‌ 

16 పరుగులు చేసన హృదయ్ శార్దుల్‌ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 38 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్‌ 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. క్రీజులో ముష్ఫికర్‌ రహీమ్‌ , మహ్మదుల్లా ఉన్నాడు.

  • లిట్టన్‌ దాస్‌ ఔట్‌..

88 బంతుల్లో 66 పరుగులు చేసిన ఒపెనర్‌ లిట్టన్‌ దాస్‌ రవీంద్రజడేజా బౌలింగ్‌లో సుభ్‌మాన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి ముష్ఫికర్‌ రహీమ్‌ వచ్చాడు. తౌహిద్‌ హృదయ్ 14 బంతుల్లో 5 పరుగులు చేశాడు. 28 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్‌ 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.

  •  మెహిదీ హసన్‌ మిరాజ్‌ ఔట్‌.. బంగ్లా 131/3

సిరాజ్‌ బౌలింగ్‌లో మెహిదీ హసన్‌ మిరాజ్‌ ఔట్‌ వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి తౌహిద్‌ హృదయ్ వచ్చాడు. లిట్టన్‌ దాస్‌ 63 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌ 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది

  • లిట్టన్‌ దాస్‌ 50

బంగ్లా ఒపెనర్‌ లిట్టన్‌ దాస్‌ 62 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. లిట్టన్‌ దాస్‌ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు ఉన్నాయి. బంగ్లా ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసే సరికి 114 పరుగులు చేసింది.

  • రెండో వికెట్‌ డౌన్‌. షాంటో ఔట్‌.. బంగ్లా 110/2

రవీంద్ర జడేజా బౌలింగ్‌ బంగ్లా కెప్టెన్‌ నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. షాంటో 17 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు లిట్టన్‌ దాస్‌ 60 బంతుల్లో 48 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 20 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్‌ 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది

  • తంజిద్‌ హసన్‌ ఔట్‌.. కుల్‌దీప్‌కు తొలి వికెట్‌

కుల్‌దీప్‌ బౌలింగ్‌లో 50 పరుగులు చేసిన తంజిద్‌ హసన్‌ ఎల్బీగా ఔటయ్యాడు. క్రీజులోకి నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో వచ్చాడు. 15 ఓవర్లు ముగిసే సరికి బంగ్లా 94/1 ఉంది. లిట్టన్‌ దాస్‌ 39 పరుగులు చేశాడు.

  • తంజిద్‌ హసన్‌ 50

బంగ్లా ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 41 బంతులు ఆడిని తంజిద్‌ హసన్‌ 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ధశతంకం పూర్తి చేశాడు. మరో ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌ 43 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. ప్రస్తుతం 14 ఓవర్లు పూర్తయ్యే సరికి బంగ్లాదేశ్‌ 90 పరుగులు చేసింది.

  • 13 ఓవర్లు పూర్తి.. బంగ్లా 82/0

13 ఓవర్లు పూర్తయ్యే సరికి బంగ్లా 82 పరుగులు చేసింది. కుల్‌దీప్‌ వేసిన 13వ ఓవర్‌లో 1 4 2 1 1 Wd 0 పరుగులు వచ్చాయి. తంజిద్‌ హసన్‌ 37 బంతుల్లో 44 పరుగులు, లిట్టన్‌ దాస్‌ 41 బంతుల్లో 35 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • శార్దుల్‌ ఓవర్‌లో 6,4,6.. బంగ్లా 63/0

10వ ఓవర్‌ వేసిన శార్దుల్‌ బౌలింగ్‌లో బంగ్లా ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ వరుసగా 6,4,6 బాదాడు. దీంతో బంగ్లా 10 ఓవర్లు పూర్తయ్యే సరికి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం తంజిద్‌ హసన్‌ 30 బంతుల్లో 40 పరుగులు, లిట్టన్‌ దాస్‌ 21 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • 9 ఓవర్లుకు 47

9 ఓవర్లు ముగిసే సరికి బంగాదేశ్‌ వికెట్‌ నష్టపోకుండి 47 పరుగులు చేసింది. తంజిద్‌ హసన్‌, లిట్టన్‌ దాస్‌ నిలకడా ఆడుతున్నారు. తంజిద్‌ హసన్‌ 24, లిట్టన్‌ దాస్‌ 21 పరుగులు మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • టాస్‌ గెలిచి బంగ్లాదేశ్‌.. తొలుత బ్యాటింగ్‌

పూణే వేదికగా భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. గాయం కారణంగా షకీబ్‌ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండటంతో నజ్ముల్‌ బంగ్లా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. షకీబ్‌ స్థానంలో నసుమ్‌, తస్కిన్‌ స్థానంలో హసన్‌ జట్టులో వచ్చారు. మరోవైపు భారత్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది.

తుది జట్లు..
టీమిండియా:
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

బంగ్లాదేశ్‌: తంజిద్‌ హసన్‌, లిట్టన్‌ దాస్‌, నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో (కెప్టెన్‌), నసుమ్‌ అహ్మద్‌, మెహిదీ హసన్‌ మిరాజ్‌, ముష్ఫికర్‌ రహీమ్‌(వికెట్‌కీపర్‌), తౌహిద్‌ హదొరు, మెహది హసన్‌, హసన్‌, షోరిఫుల్‌ ఇస్లాం, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌