Sep 25,2023 07:26

కథా రచయిత, అనువాదకుడు జిల్లేళ్ళ బాలాజీకి అనువాదంలో కె.ఎస్‌.విరుదు పురస్కారం లభించింది. తమిళనాడు కోయంబత్తూరులోని 'విజయ రీడర్స్‌ సర్కిల్‌' ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఇతర భాషల నుంతమిళంలోకీ, తమిళం నుంచి ఇతర భాషల్లోకి అనువాదం చేసే ఇద్దరికి 'విజయ రీడర్స్‌ సర్కిల్‌' 'కె.ఎస్‌.విరుదు' పురస్కారాన్ని అందిస్తారు. ఈ ఏడాదికి (2023) గాను జిల్లేళ్ళ బాలాజీకి వచ్చే అక్టోబరు నెల 8వ తారీఖున కోయంబత్తూరు వేదికగా సన్మానించి, జ్ఞాపికతో పాటు పురస్కారంగా రూ.50 వేల నగదు ఇవ్వనున్నారు. జిల్లేళ్ళ బాలాజీ 1983 నుంచి కథలు రాస్తున్నారు. ఇప్పటిదాకా 150 కి పైగా కథానికలు, 120 కి పైగా కవితలూ రాశారు. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీల్లో 20 కథలకు బహుమతులు లభించాయి. బాలాజీ రచనలతో పలు కథా, కవితా సంపుటాలు, నవలలు వెలువడ్డాయి.