ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : బహుజన సమాజ పార్టీ వ్యవస్థాపకులు కాన్షిరామ్ 17వ వర్ధంతి వేడుకలను మంగళవారం బైరెడ్డిపల్లిలో ఘనంగా నిర్వహించారు. పలమనేరు నియోజకవర్గం అసెంబ్లీ అధ్యక్షులు ఆర్ సురేంద్ర, అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ కళ్యాణ్. అసెంబ్లీ కన్వీనర్ సౌందర్యరజున్‌ల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని చెక్‌పోస్టు కొండల వద్ద బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు కాన్షిరామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పలమనేరు నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షులు సురేంద్ర మాట్లాడుతూ ... 1984 లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెనుకబడినకులాల కోసం కాన్సిరాం అప్పట్లో పార్టీని స్థాపించారని స్మరించుకున్నారు. ఆయన చేసిన కార్యక్రమాలు మరువలేనివని ఆయన స్థాపించిన పార్టీని ఇప్పుడు కూడా మాయావతి అధ్యక్షతన కొనసాగుతున్నదని తెలిపారు. తమ నియోజకవర్గంలో కూడా బీఎస్పీ పార్టీని గెలిపిస్తే అనేక సేవలు ప్రజలకు అందుతాయని పిలుపునిచ్చారు. అనంతరం అక్కడికి వచ్చిన వారందరికీ తేనీటి విందునిచ్చారు.










