Nov 13,2023 15:57

ప్రజాశక్తి - ఆలమూరు:మండలంలోని చెముడులంకలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఈదల సత్తిబాబు, మండల మాజీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ నాగిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి తిరుగుతూ షఉరిటీ పత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేనిఫెస్టో టిడిపి జనసేన పార్టీలో ఉమ్మడి మేనిఫెస్టోగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కొత్తపల్లి రాంబాబు, నాగిరెడ్డి శ్రీనువాస్‌, ఉంగరాల బాబులు, సిరంగుల సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.