జాతీయం
రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం.. అందుకే జనగణన నిర్వహించడం లేదు : ఛత్తీస్‌గఢ్ సిఎం భూపేష్ భఘేల్
రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని, అందుకే 2021లో జరగాల్సిన జనగణనను కేంద్ర ప్రభుత్వం ఇంకా చేపట్టడం లేదని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ విమర్శించారు. రారుపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 'రాష్ట్రంలో 43.5 శాతం ఒబిసిలు, 3.5 శాతం ఇడబ్ల్యూఎస్ ఉన్నారు. దీని ప్రకారమే వారికి రిజర్వేషన్లు కల్పించాం. రాష్ట్రంలో 43 శాతానికి పైగా ఒబిసిలు ఉన్నారని బిజెపి నమ్మకపోతే ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2021 జనగణన ఎందుకు నిర్వహించడం లేదు? మేం ఛత్తీస్‌గఢ్‌లో కులగణన నిర్వహించాం. బీహార్‌లోనూ ఇలాంటిది జరిగింది. మరి కేంద్రం (బిజెపి ప్రభుత్వం) ఎందుకు జనగణన చేయడం లేదు?' అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.










