ప్రజాశక్తి - బి.కొత్తకోట (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా, బి.కొత్తకోట నగర పంచాయతీ నూతన కమిషనర్ గా మనోహర్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ కేటగిరి ఒకటి-మేనేజర్ గా పనిచేస్తున్న ఆయనను బి.కొత్తకోట నగర పంచాయతీ కమిషనర్ గా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ మున్సిపల్ శాఖ డైరెక్టర్ పి. కోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ మనోహర్ మాట్లాడుతూ ... ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేసి నగర పంచాయతీ అభివీద్ధిలో భాగస్వామ్యమవుతానన్నారు. ప్రస్తుత కమిషనర్ నరసింహ ప్రసాద్ పుంగునూరు కమిషనర్ గా ఉంటూ బి.కొత్తకోట నగర పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఉంటారు. నూతన కమిషనర్ కు నరసింహ ప్రసాద్ బాధ్యతలు అప్పగించారు. నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మనోహర్ కు నగర పంచాయతీ కార్యాలయంలో నగర పంచాయతీ సచివాలయ కన్వీనర్లు సిఆర్.చిన్నికృష్ణ, గుమ్మడికాయల చాంద్ భాష, తుమ్మగింజలు జనార్ధన్, భీమగాని ప్రభాకర్ రెడ్డి, నగర పంచాయతీ ఆర్‌ఐ శ్రీనివాసులు, అకౌంట్ ఆఫీసర్ రమాదేవి, జూనియర్ అసిస్టెంట్ కిరణ్ కుమార్, నగర పంచాయతీ విఆర్‌ఓ అమర్ నారాయణ, వెంకటరమణ, హైదర్, అశోక్, సచివాలయ ఉద్యోగులు రాజేంద్ర, మౌలా, సరోజ్ భాషా, సుమతి మర్యాద పూర్వకంగా కలిసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఇందులో భాగంగా శాలువ కప్పి, స్వీట్లు తినిపించి ఘనంగా సత్కరించి, పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... గతంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం మనోహర్ కి ఉందని, నగర పంచాయతీ సమస్యలను ఆయన సులభంగా పరిష్కరిస్తారని చెప్పారు.










