Nov 13,2023 11:35

ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్య) : మండల కేంద్రమైన కలకడ పోలీస్‌ స్టేషన్‌ లో ఆయుధపూజను సోమవారం ఘనంగా నిర్వహించారు. కలకడ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్ర ఆధ్వర్యంలో దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించినట్లు ఎస్సై తిప్పేస్వామి తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లోని వాహనాలు, బైక్‌లు, కంప్యూటర్లు, తుపాకులు, ఇతర వస్తువులను పేద పండితుల మంత్ర ఉచ్చారణతో పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఏడాది మండల పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సామరస్యమైన జీవితాన్ని ప్రజలు గడపాలని కోరి మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ బాలకఅష్ణ, హెడ్‌ కానిస్టేబుల్స్‌ సునీల్‌ శశి కుమార్‌, హరిబాబు, రమేష్‌ కుమార్‌, గోపికఅష్ణ ,పోలీస్‌ సిబ్బంది యూనస్‌ ,రమేష్‌ , రియాజ్‌, లక్ష్మీనారాయణ, వలి ,కరుణాకర, రామ్మోహన ,మహబూబ్‌ బాషా, ప్రతాప్‌ ,సుబ్బయ్య, డ్రైవర్‌ రమేష్‌, హౌంగార్డు నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.