కర్నూలు స్పోర్ట్స్ : యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హర్యానా వేదికగా ఈ నెల 17, 18 తేదీలలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన జాతీయ స్థాయి న్యాయ నిర్ణేతల (రిఫ్రీ) పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ , కర్నూలు జిల్లా నుంచి అవినాష్ శెట్టి, బి.గ్రేడ్ కు ఇండియాలో మొదటి స్థానాన్ని సాధించారు. కల్లూరు మండలం కు చెందిన యోగా గురువు విజయకుమార్ ''సీ గ్రేడ్''కు నిర్వహించిన పరీక్షలలో 82 మార్కులు సాధించి ఆరో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా యోగా సంఘం ప్రతినిధులు లక్ష్మీకాంత రెడ్డి, శ్రీధర్ రెడ్డి, జిల్లా క్రీడా సంఘాల ప్రతినిధులు, కర్నూలు జిల్లా యోగా సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.










