న్యూఢిల్లీ : విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీదారు అథెర్ ఎనర్జీ అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. తాజాగా నేపాల్‌లో తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ 450ఎక్స్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ వాహనాలను భారత్ నుంచి ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది. కొత్త మార్కెట్లపై తమ సంస్థ దృష్టి పెడుతుందని అథెర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ పోకెల తెలిపారు. నేపాల్‌కు విస్తరించడం ద్వారా తొలిసారి అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించామని.. ఇక బహుళ మార్కెట్లపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు.