- మలేషియాతో మ్యాచ్ రద్దు
- రేపటినుంచి 19వ ఆసియా క్రీడలు
హాంగ్జౌ(చైనా): భారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా క్రీడల్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మలేషియాతో బుధవారం జరగాల్సిన మ్యాచ్ భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం కారణంగా రద్దు అయ్యింది. దీంతో స్మృతి మంధాన సారథ్యంలోని భారతజట్టు నేరుగా సెమీస్‌కు చేరింది. కెప్టెన్ మంధాన(27) త్వరగా ఔటైనా.. మరో ఓపెనర్ షఫాలీ వర్మ(67), జెమీమా రోడ్రిగ్స్(47నాటౌట్), రీచా ఘోష్(21నాటౌట్) రాణించడంతో భారత్ నిర్ణీత 15 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 173పరుగులు చేసింది. ఆ తర్వాత మలేషియా ఇన్నింగ్స్ మొదలయ్యాక 2 బంతుల్లో ఒక పరుగులు చేసిన తర్వాత భారీ వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. దాంతో, రిఫరీలు భారత్‌ను విజేతగా ప్రకటించారు. భారత్, మలేషియా మ్యాచ్‌కు వరుణుడు ఆదిలోనే అడ్డుపడ్డాడు. దాంతో, టాస్ ఆలస్యంగా వేశారు. టాస్ గెలిచిన మలేషియా కెప్టెన్ వినిఫ్రెడ్ దురారు ఫీల్డింగ్ ఎంచుకుంది. కానీ, టీమిండియా ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి 90 బంతుల్లోనే 171పరుగులు చేయడంతో రన్‌రేట్ అమాంతం పెరిగిపోయింది. తొలిసారి ఈ మెగా టోర్నీలో ఆడుతున్న భారత జట్టు టైటిల్‌పై కన్నేసింది. సెమీస్ పోరుకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందుబాటులో ఉండనుంది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో దురుసు ప్రవర్తనతో హర్మన్‌ప్రీత్‌పై ఐసిసి నిషేధం విధించిన విషయం తెలిసిందే.
.@TheShafaliVerma was a class act with the bat in the 19th #AsianGames quarter-final 🏏💥
React to her 🔥innings in one emoji 💬#SonySportsNetwork #Hangzhou2022 #TeamIndia #Cheer4India #IssBaarSauPaar pic.twitter.com/v7TVVeKB9K
— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2023
ఛెత్రీ సేన గెలుపు..
పురుషుల ఫుట్‌బాల్ గ్రూప్-ఏలో భారత జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య చైనా చేతిలో 1-5గోల్స్‌తో ఓడిన ఛెత్రీ సేన.. బుధవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 1-0తో గెలిచింది. తొలి అర్ధభాగంలో గోల్ చేయని భారత్.. రెండో అర్ధభాగంలో లభించిన పెనాల్టీని బ్రైస్ మిరండా గోల్ చేశాడు.
ఇక మహిళల ఫుట్‌బాల్ జట్టు 1-2గోల్స్ తేడాతో చైనీస్ తైపీ చేతిలో ఓడింది. భారత్‌కంటే చైనీస్ తైపీ జట్టు ర్యాంకింగ్స్‌లో మెరుగైన జట్టు.










