చైనా : ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. చైనాలోని హాంగ్ జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ కేంద్రంగా ప్రారంభమైన ఈ క్రీడల్లో ఇవాళ ఆరంభంలోనే భారత్ పతకాల వేట ప్రారంభించింది. పాల్గొన్న మొదటి ఈవెంట్‌లోనే పతకాన్ని సాధించి శుభారంభం అందించారు భారత షూటర్లు. 10మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత, మెహులి ఘోష్, అశి చౌక్సే అద్భుత ప్రదర్శనతో సిల్వర్ మెడల్ అందుకున్నారు. గ్రూప్ విభాగంలో మెడల్ సాధించడంతో పాటు రమిత, మెహులి వ్యక్తిగత విభాగంలోనూ ఫైనల్‌కు చేరారు. ఇక భారత ఆర్మీకి చెందిన అర్జున్ లాల్ జాట్, అరవింద్ కలిసి పురుషుల రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్ విభాగంలో మరో సిల్వర్ సాధించారు. ఇక రోయింగ్ విభాగంలోనే బాబులాల్ యాదవ్, లేఖ్ రామ్ జోడీ కాంస్య పతకం, ఎనిమిది మందితో కూడిన టీమ్ మరో సిల్వర్ కూడా భారత్ సాధించింది.










