Oct 13,2023 10:43

న్యూఢిల్లీ : 2008 బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఉరిశిక్ష పడిన దోషి, ఇండియన్‌ ముజాహీదిన్‌(ఐఎం) ఉగ్రవాది ఆరిజ్‌ఖాన్‌ మరణశిక్షను ఢిల్లీ హైకోర్టు గురువారం రద్దు చేసింది. మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తున్నట్టు వెల్లడించింది. ఢిల్లీ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌చంద్‌ హత్య, ఇతర అభియోగాలపై రెండేళ్ల క్రితం ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు ఆరిజ్‌ఖాన్‌ను దోషిగా తేల్చి మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.