Oct 31,2023 07:57

ఎర్రగుంట్ల (వైఎస్‌ఆర్‌) : మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అప్రూవర్‌గా మారిన దస్తగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల రోజుల క్రితం వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్లలో జరిగిన ప్రేమ వివాహం విషయంలో దర్యాప్తునకు సంబంధించి దస్తగిరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు. యువతిని కారులో కిడ్నాప్‌ చేశారన్న ఆరోపణలపై దస్తగిరిని విచారించనున్నట్లు చెప్పారు.