
- ఫారూఖీ మ్యాజిక్ బౌలింగ్
పూణే : ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు మరో సంచలనానికి తెరలేపింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌జట్టు శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 49.3ఓవర్లలో 241పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ లక్ష్యాన్ని ఆఫ్ఘన్ జట్టు 45.2ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 242పరుగులు చేసి గెలిచింది. తొలుత టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన లంకను ఆఫ్ఘన్ బౌలర్లు కట్టడి చేశారు. ఫజల్లా ఫారూఖీ(4/34) శ్రీలంకను కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించాడు. శ్రీలంక ఓపెనర్ దిముత్ కరుణరత్నె(15) విఫలమైనా.. కెప్టెన్ కుశాల్ మెండిస్(39), పతుమ్ నిస్సంక(46) రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ఈ జోడీని అజ్మతుల్లా విడదీశాడు. నిస్సంక నిష్క్రమిం చినా కుశాల్.. మిడిలార్డర్ బ్యాటర్ సదీర సమర విక్రమ(36)లు మూడో వికెట్‌కు 50 పరుగులు జతచేశారు. కానీ ఐదు పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరూ నిష్క్రమించడంతో లంక కష్టాల్లో పడింది. మిడిలార్డర్‌లో చరిత్ అసలంక(22), ధనంజయ డిసిల్వ(14)లు పెద్దగా ప్రభావం చూపలేదు. ఏంజెలో మాథ్యూస్(23) చివరిదాకా ఉన్నా అతడు బ్యాట్ ఝుళిపించలేకపోయాడు. లంక లోయరార్డర్ బ్యాటర్ దుష్మంత చమీర(1), మహీశ్ తీక్షణ(29) ఆదుకోవడంతో లంక స్కోరు 200 మార్కు దాటింది. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్లా ఫరూకీ నాలుగు వికెట్లు తీయగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు రెండు, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జారులు తలా ఓ వికెట్ దక్కాయి. ఛేదనలో ఆఫ్ఘన్ ఓపెనర్ గుర్బాజ్(0)డకౌట్ అయినా.. జడ్రాన్(39), షా(62) కలిసి 2వ వికెట్‌కు 73పరుగులు జతచేశారు. ఆ తర్వాత కెప్టెన్ షాహిది(58నాటౌట్), అజ్మతుల్లా(73నాటౌట్) కలిసి మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. విజయవానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా.. అజ్మతుల్లా ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను లంక ఫీల్డర్ జారవడంతో ఆఫ్ఘన్ విజయం ఖాయమైంది. మధుశంకకు రెండు, రజితకు ఒక వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫారూఖీకి లభించింది.
స్కోర్‌బోర్డు...
శ్రీలంక ఇన్నింగ్స్: నిస్సంక (సి)గుర్బాజ్ (బి)అజ్మతుల్లా 46, కరుణరత్నే (ఎల్‌బి)ఫారూఖీ 15, కుశాల్ మెండీస్ (సి)నజ్బుల్లా (బి)ముజీబ్ 39, సమర విక్రమ (ఎల్‌బి)ముజీబ్ 36, అసలంక (సి)రషీద్ (బి)ఫారూఖీ 22, డి-సిల్వ (బి)రషీద్ ఖాన్ 14, మాథ్యూస్ (సి)నబి (బి)ఫారూఖీ 23, ఛమీర (రనౌట్) జడ్రాన్ 1, తీక్షణ (బి)ఫారూఖీ 29, రజిత (రనౌట్) గుర్బాజ్ 5, మధుశంక (నాటౌట్) 0. వికెట్ల పతనం: 1/22, 2/84, 3/134, 4/139, 5/167, 6/180, 7/185, 8/230, 9/239, 10/241 బౌలింగ్: ముజీబ్ 10-0-38-2, ఫారూఖీ 10-1-34-4, నవీన్-హక్ 6.3-0-47-0, అజ్మతుల్లా 7-0-37-1, రషీద్ ఖాన్ 10-0-50-1, నబి 6-0-33-0.
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (బి)మధుశంక 0, జడ్రాన్ (సి)కరుణరత్నే (బి)మధుశంక 39, రామత్ షా (సి)కరుణరత్నే (బి)రజిత 62, హస్మతుల్లా షాహిది (నాటౌట్) 58, అజ్మతుల్లా (నాటౌట్) 73, అదనం 10. (45.2ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 242పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/73, 3/131
బౌలింగ్: మధుశంక 9-0-48-2, రజిత 10-0-48-1, మాథ్యూస్ 3-0-18-0, ఛమరీ 9.2-0-51-0, తీక్షణ 10-0-55-0, ధనుంజయ 4-0-21-0
వన్డే ప్రపంచకప్‌లో నేడు..
పాకిస్తాన్ × బంగ్లాదేశ్
(వేదిక: కోల్‌కతా; మ.2.00గం||లకు)