Oct 14,2023 11:31

న్యూ ఢిల్లీ : హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో ... ఇజ్రాయిల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే 'ఆపరేషన్‌ అజయ్' రెండో విడతలో భాగంగా 235 మంది భారతీయులతో కూడిన విమానం శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున టెల్‌ అవీవ్‌ నుంచి బయలుదేరిన తొలి బ్యాచ్‌ ప్రత్యేక విమానం ద్వారా 212 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున స్వదేశానికి చేరుకున్న రెండో బ్యాచ్‌ 235 మంది భారతీయులకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ స్వాగతం పలికారు. హమాస్‌- ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న భీకర పోరు నుంచి తమను సురక్షితంగా భారత్‌కు తీసుకురావడంపై వారు హర్హం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడికి కఅతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్‌లో 18 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. 'ఆపరేషన్‌ అజరు'లో భాగంగా రెండు విడతలు పూర్తయ్యాయి. మిగిలిన వారిని విడతలవారీగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.