ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి జిల్లా అధ్యక్షులుగా రెండవ సారి నేదురుమల్లి. రాంకుమార్ రెడిని నియమించిన సందర్బంగా కోట మండలం గూడలి పంచాయతీకి చెందిన కోట మండల వైసిపి సోషల్ మీడియా కో కన్వీనర్ ఆములూరు.నాగార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆములూరు.నాగార్జున్ మాట్లాడుతూ.. నేదురుమల్లి. రాంకుమార్ రెడ్డి వైసిపి బలోపేతానికి కృషి చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి కూడా తిరుపతి జిల్లా అధ్యక్షులు పదవి కట్టబెట్టడం సంతోషదాయకంగా ఉందని అన్నారు.










