Oct 14,2023 12:56

వాషింగ్టన్‌ (అమెరికా) : '' ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా ఉంటుంది '' అని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు.

హమాస్‌ దాడిలో 1000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారనీ, ఇందులో 27 మంది అమెరికన్లు ఉన్నారు. వీళ్లు (హమాస్‌ గ్రూప్‌ను ఉద్దేశిస్తూ) చాలా దుర్మార్గులు అని, అల్‌ఖైదా ముష్కరుల్లాగే ప్రవర్తిస్తున్నారనీ... తాను ముందు నుంచీ చెబుతున్నట్లుగా ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా ఉంటుందని జో బైడెన్‌ అన్నారు. స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు అని అన్నారు. హమాస్‌ దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని అని బైడెన్‌ వ్యాఖ్యానించారు. హమాస్‌ దాడులతో పాలస్తీనా పౌరులకు ఎలాంటి సంబంధం లేదన్న వాస్తవాన్ని కూడా గుర్తించాలని బైడెన్‌ చెప్పారు. ఈ యుద్ధం ఫలితంగా పాలస్తీనీయులు కూడా తీవ్ర కల్లోల పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇక హమాస్‌ దాడుల తరువాత కొంతమంది అమెరికా పౌరులకు కన్పించకుండా పోయిన ఘటనపైనా బైడెన్‌ స్పందించారు. వారి ఆచూకీ గుర్తించి, క్షేమంగా తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం నిర్విరామంగా కఅషి చేస్తోందని బైడెన్‌ తెలిపారు.