న్యూఢిల్లీ: న్యూయార్క్ సిక్కు కార్యకర్త హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య తరువాత అందుకు సంబంధించిన ఆధారాలను అమెరికా గూఢచారి సంస్థలు కెనడాకు అందించాయని, దాని అధారంగానే ఈ హత్యలో భారత ప్రభుత్వ పాత్రపై ఒక నిర్ధారణకు వచ్చారని న్యూయార్క్ టైమ్స్ (ఎన్‌వైటి) పత్రిక వెల్లడించింది. ఈ హత్యకేసులోభారత ఏజెంట్ల ప్రమేయానికి సంబంధించి అమెరికా గూఢచారి సంస్థలు అత్యంత కచ్చితమైన ఆధారాలు సేకరించాయని పేరు తెలపడానికి ఇష్టపడని అధికారి ఒకరు న్యూయార్క్ టైమ్స్‌కు తెలిపారు. స్మోకింగ్ గన్ ద్వారా కెనడాలో భారతీయ దౌత్యవేత్తల సమాచార మార్పిడిని ట్రాక్ చేసిందని ఎన్‌వైటి పేర్కొంది. కెనడాలో అమెరికా రాయబారి డేవిడ్ కొహెన్ కెడనడియన్ న్యూస్ చానెల్ సిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. నిజ్జార్ జూన్ 18న కెనడాలోని వాంకోవర్‌లో కాల్చి చంపబడ్డాడు.
ఇరకాటంలో మోడీ సర్కార్
భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు మోడీ ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పడేశాయి. కెనడియన్ సిక్కు కార్యకర్త హరదీప్ సింగ్ నిజ్జార్‌ను కెనడా గడ్డపై హత్య గావించడం వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా చేసిన ఆరోపణలపై భారత్ నుంచే కాకుండా పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు ప్రత్యేకించి ఫైవ్ ఐస్ గ్రూపు కూడా తీవ్రంగా రియాక్షన్ వచ్చింది. ఇవి ప్రపంచ వేదికపై భారత దేశ స్థానం, విశ్వసనీయతను దెబ్బ తీసే అవకాశముంది. అందులోనూ ఎన్నికల సంవత్సరంలో ఇది మోడీ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. భారత ప్రభుత్వంపై ఈ ఆరోపణలు బహిరంగంగా బహిరం గంగా వచ్చాయి. దీనిపై న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన నికోలస్ క్రిస్టోఫ్ వ్యాఖ్యా నిస్తూ, నిరంకుశ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న దేశాలతో ఎలా వ్యవహరిం చాలనేదానికి భారత్, కెనడా ఉదంతం ఒక హెచ్చరికగా నిలుస్తుందని అన్నారు.