ఢాకా : ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య విషయంలో కెనడాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో ... కొద్దిరోజుల క్రితం శ్రీలంక విదేశాంగ మంత్రి సైతం భారత్‌కు మద్దతు తెలిపారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా భారత్ పై ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తాజాగా బంగ్లాదేశ్ సైతం కెనడా వైఖరిని తప్పుపట్టింది. పరోక్షంగా భారత్‌కు మద్దతు తెలిపింది.
'' హంతకులకు కెనడా కేంద్రం కాకూడదు. హత్య చేసిన వారంతా కెనడాకు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారు. అక్కడ వారు మంచి జీవితాన్ని గడుపుతున్నారు. కానీ, వారి బంధువులు మాత్రం స్వదేశంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. నూర్ చౌదురి అప్పగింతపై కెనడాకు మేము అన్ని ఆధారాలు సమర్పించాం. కానీ, కెనడా మాత్రం ఇప్పటివరకు దానిపై స్పందించలేదు '' అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మూమెన్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్-కెనడా వివాదంపై స్పందిస్తూ.. రెండూ బంగ్లాదేశ్‌కు మిత్ర దేశాలే అని వ్యాఖ్యానించారు.