Aug 04,2023 10:54

లండన్‌ :   కాప్‌ 26 సదస్సుకు వ్యతిరేకం నిరసనల్లో పాల్గొన్నందుకు  యంగ్‌ కమ్యూనిస్ట్‌ లీగ్‌ (వైసిఎల్‌ ) కార్యకర్తపై విచారణ దాదాపు రెండేళ్ల ఆలస్యం తర్వాత గురువారం ప్రారంభమైంది. కాప్‌ 26 సమ్మిట్‌ నవంబర్‌ 2021లో జరిగింది, వాతావరణ మార్పులపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రపంచ నాయకులను గుర్తుచేస్తే ప్రయత్నంలో భాగంగా ఈ నిరసనలు జరిగాయి. నిరసనల్లో పాల్గొన్న  అనేక మందిని పోలీసులు ఆదే రోజు అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువ మందిని వెంటనే విడుదల చేశారు. కానీ, గ్లాస్గో వైసిఎల్‌ కార్యదర్శి నాథన్‌ హెన్నెబ్రీ మాత్రం విచారణను ఎదుర్కొంటున్నారు.