కర్నాటక : కావేరి జలవివాదం నేపథ్యంలో ... కర్నాటకలో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో .... నిరసనకారులు హీరో సిద్ధార్థ్ మీడియా సమావేశాన్ని అడ్డుకోవడంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. '' దశాబ్దాలుగా ఈ సమస్యను పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలన్నీ.. నేతలను ప్రశ్నించకుండా.. నిస్సహాయులైన సామాన్యులను..కళాకారులను అడ్డుకోవడం సరికాదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలను ప్రశ్నించండి. కన్నడ పౌరుడిగా, కర్నాటక ప్రజల తరపున నేను నీకు క్షమాపణలు చెబుతున్నా సిద్ధార్థ్ '' అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దీనికి రెండు చేతులు జోడించి ఉన్న ఎమోజీలను పెట్టారు. ఇక దీనిపై సిద్ధార్థ్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. 'ఇలా జరగడం చాలా బాధగా ఉంది' అని కామెంట్స్ పెడుతున్నారు.
సిద్దార్థ సినిమాపై కమల్ హాసన్ ప్రశంస...
ఇక మరోవైపు సిద్ధార్థ్ నటించిన 'చిన్నా' సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరి హృదయాలను హత్తుకుంటోంది. తాజాగా ఈ సినిమాను స్టార్ హీరో కమల్ హాసన్ ప్రశంసించారు. ''చిన్నా' నాకెంతో నచ్చింది. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది. ఇది కేవలం ఆడపిల్లలు ఉన్న వారికి మాత్రమే కాదు. పిల్లలు ఉన్న వారందరూ చూడాలి. పిల్లలను పిల్లలానే చూడాలి అనే సందేశాన్ని ఇందులో బాగా చూపించారు' అంటూ సినిమాపై కమల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.










