Sep 16,2023 10:07

భీమడోలు (ఏలూరు జిల్లా) : రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన శనివారం భీమడోలులో జరిగింది. భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద జాతీయ రహదారి ( హైవే) సర్వీస్‌ రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ బోడిగడ్ల చంటి (40) మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న మృతురాలి బంధువులు, కుటుంబీకులు రోదించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.