Nov 03,2023 11:51

శ్రీసత్యసాయి : ఇష్టం లేని పెళ్లి చేస్తారనుకొని ... అపార్ట్‌మెంట్‌ పైనుండి దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం సత్యసాయి జిల్లాలో జరిగింది.

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి గోకులంలోని సాయి శ్రీనివాస అపార్ట్‌మెంట్‌లో గౌరీ అనే యువతి కుటుంబంతో నివాసముంటుంది. డిగ్రీ చదువుతున్న విద్యార్ధిని గౌరీకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని నిర్ణయించి నిన్న పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేయాలని కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారని.. పెళ్లి చూపులు జరగడంతో ఎలాగైనా తనకు పెళ్లి చేస్తారని భావించిన యువతి సూసైడ్‌ నోట్‌ రాసి అపార్ట్‌మెంట్‌లోని ఏడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. తీవ్రగాయాలపాలైన గౌరీని వెంటనే సత్యసాయి జనరల్‌ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్థారించారు. యువతి అపార్ట్‌మెంట్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న దఅశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పుట్టపర్తి అర్బన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.