Nov 13,2023 08:34

కమలాపురం (వైఎస్‌ఆర్‌) : లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున వైఎస్‌ఆర్‌ జిల్లా కమలాపురం మండలం పందిళ్లపల్లి వద్ద జరిగింది.

పోలీసుల కథనం మేరకు ... ప్రకాశం జిల్లాలోని పొన్నలూరుకు చెందిన బింగి మహేశ్‌ (31), బింగి చిన్నమోహన్‌ (29) నల్లలింగాయపల్లెలో తాపీమేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున మహేశ్‌, చిన్నమోహన్‌ కలిసి బైక్‌ పై వెళుతూ పెట్రోల్‌ బంకు నుంచి పెట్రోల్‌ను తీసుకుని వెళుతుండగా, కమలాపురం మండలం పందిళ్లపల్లి వద్ద కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై వీరి బైక్‌ ను ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్‌, చిన్నమోహన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.